కోల్‌కతా: లోకల్ ట్రైన్లో ప్రయాణించిన కొందరు మహిళల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరికొకరు దారుణంగా పోట్లాడుకున్నారు. తల జుట్లు పట్టుకుని లాక్కోవడంతోపాటు చెప్పులతో కొట్టుకున్నారు (women brawl) . మహిళల ఫైట్‌కు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం కొందరు మహిళలు లోకల్ ట్రైన్‌లోని లేడీస్ కంపార్ట్మెంట్లో ప్రయాణించారు. ఇంతలో ఉన్నట్టుండి వారి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కొందరు మహిళలు దాడులకు దిగారు. ఒకరిపైమరొకరు చేతులు, చెప్పులతో కొట్టుకున్నారు. జుట్లు పట్టుకుని లాక్కున్నారు. కొందరు జోక్యం చేసుకుని సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే కొంతసేపటి తర్వాత మహిళల గొడవ సద్దుమణిగింది. మహిళలు కొట్టుకునేందుకు దారితీసిన గొడవకు కారణం ఏమిటన్నది తెలియలేదు.
కాగా, ఆయుషి అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు. మహిళల కుస్తీ పోటీలని ఒకరు చమత్కరించారు. సమాజంలోని మహిళల్లో సహనం లోపిస్తున్నదని మరొకరు విమర్శించారు. అయితే లోకల్ ట్రైన్లలో మహిళలు కొట్టుకున్న సంఘటన ఇదే తొలిసారి కాదు. గతంలో ముంబైలోని లోకల్ ట్రైన్లో జరిగిన ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ నాడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Kolkata local🙂 pic.twitter.com/fZDjsJm93L
— Ayushi (@Ayushihihaha) July 11, 2023