ఐఎన్ఎస్ వగ్శీర్ జలాంతర్గామిని బుధవారం ముంబైలో ఆవిష్కరించారు. ప్రాజెక్టు 75 కింద నిర్మించిన ఆరు సబ్మెరైన్లలో ఇది చివరిది. రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ ఈ జలాంతర్గామిని ప్రారంభించారు. యుద్ధ సమయాల్లో సమర్థంగా పనిచేస్తుందా లేదా అనేది తెలుసుకునేందుకు ఏడాది పాటు పలు పరీక్షలు, ట్రయల్స్ నిర్వహించనున్నారు.
హిందూ మహా సముద్రంలోని లోతైన ప్రదేశాల్లో నివసించే శాండ్ ఫిష్ పేరుమీద తొలి జలాంతర్గామి వగ్శీర్ను 1974లో నేవీలో చేర్చారు. దీన్ని 1997 ఏప్రిల్లో ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం ఆవిష్కరించిన వగ్శీర్ జలాంతర్గామితో సముద్ర ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం కానున్నది.