ఆదివారం 24 మే 2020
National - Mar 05, 2020 , 02:00:00

కలకత్తాలో వినూత్న మాస్క్‌లు..

కలకత్తాలో వినూత్న మాస్క్‌లు..

పశ్చిమబెంగాల్‌: ప్రపంచ దేశాలతో పాటు, ఇండియాను కూడా ‘కరోనా’ వైరస్‌ వణికిస్తోంది. దీంతో, పలు నగరాల్లో అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కరోనా సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, కలకత్తాలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఫేస్‌ మాస్క్‌లను వినూత్నంగా తయారు చేసి, ప్రజలకు అందజేస్తున్నారు. మాస్క్‌లపై ‘సేవ్‌ ఫ్రమ్‌ కరోనా ఇన్‌ఫెక్షన్‌ మోడిజీ’ అని ప్రింట్‌ వేయించారు. మాస్క్‌పై బీజేపీ ఎన్నికల గుర్తు కూడా ఉండడం గమనార్హం. ఈ మాస్క్‌లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. కాగా, ఈ రాక్షస వైరస్‌కు గురై, చైనాతో సహా ప్రపంచవ్యాప్తంగా 3 వేలకు పైగా జనాలు మరణించగా.. లక్ష మందికి పైగా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. ఆయా దేశాల్లో వారు ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డుల్లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. 


logo