బెంగళూరు: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి, ఆయన భార్య సుధా మూర్తి కర్ణాటక ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక, విద్య సర్వేలో వివరాలు నమోదుకు విముఖత చూపారు. సర్వేయర్లు వారి ఇంటిని సందర్శించినప్పుడు ‘మా ఇంట్లో సర్వే నిర్వహణను మేం కోరుకోవడం లేదు’ అని సుధామూర్తి తెలిపారు.
తాము వెనుకబడిన వర్గానికి చెందినవారం కామని స్పష్టం చేశారు. తమ విషయంలో ఈ సర్వే వల్ల ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం, ప్రయోజనం లేదని ప్రకటిస్తూ సుధా మూర్తి సర్వే ఫామ్ మీద సంతకం చేశారు.