భోపాల్: మధ్యప్రదేశ్లోని చిన్నారులను దగ్గు మందులు చిదిమేస్తున్నాయి. కొన్ని వారాల క్రితం కోల్డ్రిఫ్ దగ్గు మందు వల్ల సుమారు 24 మంది బాలలు మరణించినట్లు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఛింద్వారా జిల్లాలో ఆయుర్వేద మందును తాగిన ఆరు నెలల పసికందు ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
తల్లిదండ్రుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ముగ్గురు సభ్యులతో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ మందును అమ్మిన మందుల దుకాణాన్ని తాత్కాలికంగా సీల్ చేశారు.