నోయిడా: నోయిడా(గౌతమ్ బుద్ధ్ నగర్)లోని పరిశ్రమల కార్మికులు మంగళవారం మళ్లీ వీధుల్లోకి వచ్చి అధిక వేతనాల కోసం నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఘర్షణలు జరిగాయి. రెండు, మూడు చోట్ల నిరసనకారులు పోలీస్ వాహనాలపైకి రాళ్లు రువ్వారు. అయితే పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఉదయం 5 గంటల నుంచే పోలీసులు సీసీ కెమెరాలు, డ్రోన్లతో గస్తీ నిర్వహించారు. 15 కంపెనీల పారా మిలిటరీ, రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో భద్రతను పెంచారు. హింస, దహనాలకు పాల్పడిన వారి నుంచే నష్ట పరిహారాన్ని వసూలు చేస్తామని డీజీపీ రాజీవ్ కృష్ణ హెచ్చరించారు. చాలా కంపెనీలు పరిశ్రమలను తెరవలేదు. కార్మికులతో చర్చల అనంతరం కనీస వేతనాలను రూ.3 వేల వరకు పెంచుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి ప్రకటించింది.
కార్మికుల ప్రధాన డిమాండ్లు