భోపాల్: సరిహద్దుల్లో పాకిస్థాన్ దాడులను ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ తిప్పికొడుతున్నది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని క్రికెట్ స్టేడియానికి బాంబు బెదిరింపు వచ్చింది. (Stadium Gets Bomb Threat) ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియాన్ని పేల్చివేస్తామంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపీసీఏ) కార్యదర్శికి ఈమెయిల్ అందింది. దీంతో ఆ సంస్థ వెంటనే అప్రమత్తమైంది. పోలీసులకు సమాచారం ఇచ్చింది.
కాగా, పోలీసులు వెంటనే స్పందించారు. పోలీస్ బృందాలు, బాంబు స్క్వాడ్లు హోల్కర్ స్టేడియానికి చేరుకున్నారు. స్టేడియం ప్రాంగణాన్ని ఐదు గంటలపాటు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించలేదని పోలీస్ అధికారి తెలిపారు. దీంతో బెదిరింపు ఈమెయిల్‌గా భావిస్తున్నట్లు చెప్పారు. సైబర్ స్క్వాడ్‌తో కలిసి నకిలీ ఈ మెయిల్ మూలాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Madhya Pradesh: Indore’s Holkar Stadium receives bomb threat via email
A bomb threat was sent to the MPCA Secretary warning of blasts at Holkar Stadium and a hospital. The email, referencing “Operation Sindoor,” contained a message saying “Don’t mess with Pakistan.” Police, bomb… pic.twitter.com/XesKT8MI8O
— IANS (@ians_india) May 10, 2025