Watch:అతిపెద్ద మానవ గొలుసు రూపంలో భారత్ మ్యాప్… ప్రపంచ రికార్డ్ సాధించిన ఇండోర్
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మరో ఘనత సాధించింది. ఐదు వేల మందికిపైగా విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు మానవ గొలుసుగా ఏరడ్పి అతి పెద్ద భారత్ మ్యాప్‌ను రూపొందించారు. దీంతో ఇది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. 75 ఏళ్ల స్వతంత్ర వేడుకలైన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ‘జ్వాలా’ సామాజిక సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. శనివారం ఇండోర్‌లోని దివ్య శక్తిపీఠంలో భారత చిత్రపటం రూపంలో 5,335 మంది విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు గొలుసుకట్టుగా నిల్చున్నారు. అతి పెద్ద మానవ గొలుసుగా ఏర్పడి దేశం మ్యాప్‌ను రూపొందించినట్లు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది.
కాగా, ఈ కేటగిరీలో ఇప్పటి వరకు ఉన్న వరల్డ్ రికార్డును బ్రేక్ చేసినట్లు జ్వాలా సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ దివ్య గుప్తా తెలిపారు. కేవలం భారత్ మ్యాప్ బోర్డర్‌లోనే కాకుండా లోపల కూడా జాతీయ జెండా రంగులు, అశోక చక్రం రూపంలో జనం గొలుసుకట్టుగా ఏర్పడినట్లు చెప్పారు. దేశంలోని మహిళల ప్రాముఖ్యత, శక్తిని చాటేలా భారత్ మ్యాప్ బోర్డర్ చూట్టూ మహిళలను ఉంచినట్లు వెల్లడించారు.
Indore sees World Book of Records for largest human chain forming India's map
Read @ANI Story | https://t.co/6Gj0OCMHMM#IndiaAt75 #Indore #AzadiKaAmritMahotsav #IndependenceDay2022 pic.twitter.com/PDzDg2zCt8
— ANI Digital (@ani_digital) August 14, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

