ఇండోర్: మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని ఓ వ్యక్తి తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను యాక్టివా టూవీలర్‌తో ఢీకొట్టాడు. ఈ ఘటన ఇండోర్‌లోని కల్పనా నగర్లో జరిగింది. రిలేషన్ కొనసాగించాలని వత్తిడి చేసిన అతను.. గర్ల్‌ఫ్రెండ్ నిరాకరించడంతో ఆమెపై టూవీలర్‌తో దాడి చేశాడు. ఈ ఘటనకు చెందిన సీసీటీవీ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. కొన్నాళ్ల క్రితమే నిందితుడితో ఆ మహిళ రిలేషన్ తెంచుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కానీ అతను ఆమెను వెంటాడుతూ వత్తిడి చేస్తున్నట్లు గుర్తించారు. ఆ అమ్మాయి నిరాకరించడంతో.. నిందితుడి ప్రవర్తన మరింత దూకుడుగా మారింది.
అయితే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఆ మహిళను అతను వెంబడించాడు. తొలుత అతని మీదకు రాయి విసిరి తనను రక్షించుకునే ప్రయత్నం చేసింది. కానీ కోపంతో ఉన్న నిందితుడు.. కావాలనే ఆ మహిళపైకి స్కూటర్‌ను ఎక్కించాడు. గాయపడ్డ బాధితురాలు హీరానగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఇప్పటికే ఏడు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నారు.
Ex-boyfriend rams bike into young woman for breaking up with him.
The injured woman is undergoing treatment in the hospital.
This incident took place in Indore, Madhya Pradesh. pic.twitter.com/MRynfOZLSu
— India Brains (@indiabrains) September 26, 2025