బెంగళూరు : ఇండిగో సంస్థలో ట్రైనీ పైలట్‌గా ఉన్న వ్యక్తిని కులం పేరిట దూషించారన్న ఆరోపణలతో ముగ్గురిపై బెంగళూరులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇండిగోలో పని చేస్తున్న తనను సహచరులు కులం పేరిట దూషించారని, ‘కాక్‌పిట్‌లో కూర్చొని విమానం నడపడం కాదు.. వెళ్లి చెప్పులు కుట్టుకో’ అంటూ ఎగతాళి చేశారంటూ ట్రైనీ పైలట్ శరత్‌కుమార్ ఆరోపించారు. ఈ మేరకు విమాన సిబ్బంది తాపస్ డే, మనీశ్ సహాని, రాహుల్ పాటిల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బాధిత పైలట్ తండ్రి అశోక్‌కుమార్ తెలిపారు.
తన కుమారుడి సామాజిక స్థితిని కించపరిచారని, ఉద్దేశపూర్వకంగా వేధించారని స్పష్టం చేశారు. తన కుమారుడికి సెలవులు ఇవ్వకుండా, వేతనాల్లో కోతలు విధిస్తూ వేధిస్తున్నట్టు ఆరోపించారు. ఈ విషయమై ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. వారు ఘటనపై విచారణ చేస్తున్నట్టు చెప్పారు. బెంగుళూరులో పోలీసులు కేసు నమోదు చేశారు.