IndiGo | ఇండిగో సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. సంక్షోభానికి కారకులైన వారిని గుర్తించి, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించింది. సంక్షోభం నేపథ్యంలో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. ప్రయాణికులు 011 2461 0843, 2469 3963, 096503 91856 నంబర్లకు కాల్ చేయాలని సూచించింది. ఈ కంట్రోల్ రూం ద్వారా బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని కేంద్రం తెలిపింది.
ఎఫ్డీటీఎల్ నిబంధనలను డీజీసీఏ సవరించడం సరికాదని కేంద్రం అభిప్రాయపడింది. డీజీసీఏ ఇచ్చిన ఎఫ్డీటీఎల్ ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నామని ప్రకటించింది. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ప్రయాణికుల సంక్షేమం, భద్రత తమ బాధ్యత అని తెలిపింది. పరిస్థితులను వీలైనంత త్వరగా చక్కదిద్దుతామని.. మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. రద్దయిన విమాన సర్వీసులకు సంబంధించి ప్రయాణికులకు పూర్తి రీఫండ్ చేయాలని ఇండిగో సంస్థను ఆదేశించింది. ప్రయాణికులకు వసతి ఏర్పాట్లు చేయాలని సూచించింది.