నాగ్‌పూర్: ముంబై నుంచి నాగపూర్‌కు బయల్దేరిన ఇండిగో విమానం శనివారం ఉదయం నాగ్‌పూర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ కోసం కిందకు దిగడానికి ప్రయత్నించి తిరిగి పైకి ఎగిరిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రన్‌వే సరిగ్గా కనిపించకపోవడం వల్లే విమానం చివరి నిమిషంలో ల్యాండింగ్ చేయలేకపోయినట్లు ఇండిగో తెలిపింది.
ముంబై-నాగ్‌పూర్ మధ్య రెగ్యులర్‌గా నడిచే 6ఈ-5349 ఇండిగో విమానం శనివారం ఉదయం నాగ్‌పూర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ కోసం కిందకు దిగుతూ హఠాత్తుగా మళ్లీ పైకి దూసుకుపోయింది. విమానంలోని ప్రయాణికులకు ఏం జరుగుతోందో అర్థం కాక దిగ్భ్రాంతికి, ఆందోళనకు లోనయ్యారు. ఆ తర్వాత రెండోసారి ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించి సఫలీకృతమైంది.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి థాయ్‌ల్యాండ్‌లోని ఫుకెట్‌కి శనివారం బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ IX 110 విమానం సాంకేతిక సమస్య తతలెత్తడంతో తిరిగి హైదరాబాద్ చేరుకుంది.