జబల్పూర్: మధ్యప్రదేశ్‌లో జబల్పూర్ నుంచి ఆదివారం హైదరాబాద్‌కు బయలుదేరిన 6ఈ 7308 నంబర్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దానిని నాగ్‌పూర్‌కు మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్టు ఇండిగో అధికారులు తెలిపారు.
విమానంలో బాంబు స్కాడ్‌తో విస్తృతంగా తనిఖీలు జరిపారు. అయితే ఎలాంటి బాంబు లేకపోవడంతో వట్టి బెదిరింపుగా నిర్ధారించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఆహార, పానీయాలు అందించినట్టు అధికారులు చెప్పారు.