ముంబై : ఇండిగో ఎయిర్‌బస్ ఏ321 విమానం శనివారం తక్కువ ఎత్తులో గాల్లో ఎగురుతుండగా దాని తోక రన్‌వేని తాకింది. ముంబై విమానాశ్రయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్లు ఈ విమానాన్ని కిందికి దించకుండా, తక్కువ ఎత్తులో నడిపారు. ఈ సందర్భంగా ఈ ఘటన జరిగింది. కాసేపటి తర్వాత వారు విమానాన్ని సురక్షితంగా దించారు.
పైల ట్లు ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఇలా చేయడం సాధారణమేనని తెలుస్తున్నది.ఈ విమానానికి అవసరమైన తనిఖీలు, చేసిన తర్వాత కార్యకలాపాలను పునరుద్ధరిస్తామని ఇండిగో తెలిపింది.