న్యూఢిల్లీ, ఆగస్టు 4 : భారత్‌లోని సంపదంతా కొందరి వద్దే పోగుపడి ఉంటోందని తాజా అధ్యయనం వెల్లడించింది. దేశంలోని మొత్తం సంపదలో దాదాపు 60 శాతం సంపద కేవలం ఒక శాతం కుటుంబాల వద్దే పేరుకుపోయిందని బ్రోకరేజీ సంస్థ బెర్న్‌స్టీన్ తాజా నివేదిక తెలిపింది. భారత్‌లోని 30 లక్షల కుటుంబాల వద్ద దాదాపు 2.7 లక్షల కోట్ల డాలర్లు(సుమారు రూ. 235 లక్షల కోట్లు) సంపద ఉందని నివేదిక వెల్లడించింది.
కొన్ని కుటుంబాల వద్దే డబ్బు పోగుపడి ఉండడం వల్ల భారత్‌లో సంపన్నులు మరింత సంపన్నులుగా మారిపోతున్నారని నివేదిక పేర్కొంది. ఈ కొంత మంది కుబేరుల ఆర్థిక లావాదేవీలను చక్కపెట్టేందుకు ప్రొఫెషనల్ ఫైనాన్స్ మేనేజర్ల కోసం డిమాండు పెరిగే అవకాశం ఉందని బ్రోకరేజీ సంస్థ అభిప్రాయపడింది.