న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతున్నది. ఒక్కో నెలకు ఒక్కో శాతం పెరుగుతూ వస్తున్నది. సెంటర్ ఫర్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) నివేదిక ప్రకారం సెప్టెంబర్‌లో 6.43 శాతంగా ఉన్న నిరుద్యోగం అక్టోబర్ నాటికి 7.77 శాతానికి పెరిగింది. ఒక్క నెలలోనే ఏకంగా 1.34 శాతం పెరిగింది. గ్రామాల్లో అధికంగా నిరుద్యోగం పెరిగింది. సెప్టెంబర్‌లో 5.84 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు, అక్టోబర్ నాటికి 8.04 శాతానికి చేరింది. అటు.. లేబర్ పార్టిసిపేషన్ రేటు సెప్టెంబర్‌లో 39.3 శాతంగా ఉండగా, అది అక్టోబర్‌కు 39 శాతానికి తగ్గింది.