Taapsee Pannu | హీరోయిన్ల వివాదంపై తాప్సీ షాకింగ్ కామెంట్స్.. ప్రేక్షకులనే నిందిస్తూ మేకర్స్ తప్పించుకుంటున్నారా?
Taapsee Pannu | సినిమాల్లో హీరోయిన్లను చూపించే విధానం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రామ్ చరణ్ ‘పెద్ది’ , కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ చిత్రాల్లో మహిళా పాత్రలను ప్రెజెంట్ చేసిన తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. హీరోయిన్ల పాత్రలు, వారి లుక్, దుస్తులు, కెమెరా యాంగిల్స్ విషయంలో గ్లామర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే అభిప్రాయాలు నెటిజన్ల నుంచి వ్యక్తమయ్యాయి.
Taapsee Pannu | సినిమాల్లో హీరోయిన్లను చూపించే విధానం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రామ్ చరణ్ ‘పెద్ది’ , కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ చిత్రాల్లో మహిళా పాత్రలను ప్రెజెంట్ చేసిన తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. హీరోయిన్ల పాత్రలు, వారి లుక్, దుస్తులు, కెమెరా యాంగిల్స్ విషయంలో గ్లామర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే అభిప్రాయాలు నెటిజన్ల నుంచి వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్ తాప్సీ పన్ను చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తన తాజా చిత్రం ‘గాంధారి’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తాప్సీ.. సినిమా పరిశ్రమలో ‘డిమాండ్ అండ్ సప్లై’ విధానం, సోషల్ మీడియా విమర్శలు, ప్రేక్షకుల అభిరుచులపై కీలక వ్యాఖ్యలు చేసింది.
సినిమాల్లో హీరోయిన్లను గ్లామర్‌గా చూపించడంపై సోషల్ మీడియాలో వచ్చే విమర్శల గురించి తాప్సీని ప్రశ్నించగా.. డిజిటల్ ప్రపంచానికి, గ్రౌండ్ లెవల్లో ఉన్న ప్రేక్షకుల అభిప్రాయాలకు చాలా తేడా ఉంటుందని ఆమె చెప్పింది. ముఖ్యంగా మాస్ సినిమాల విషయంలో సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు సినిమాలపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని తాప్సీ అభిప్రాయపడింది. నెట్లో ఎంత చర్చ జరిగినా.. అదే గ్లామర్ ఫొటోలను జూమ్ చేసి, వివిధ యాంగిల్స్‌లో వీడియోలు తయారు చేసి వైరల్ చేసే వాళ్లు కూడా సోషల్ మీడియాలోనే ఉన్నారని ఆమె పేర్కొంది. అంటే ఒకవైపు అదే కంటెంట్‌ను విమర్శిస్తూ.. మరోవైపు దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను వైరల్ చేయడం కూడా జరుగుతోందని తాప్సీ చెప్పుకొచ్చింది. దీనిని బట్టి అలాంటి కంటెంట్‌కు సోషల్ మీడియాలో కొంత మేర ఆదరణ ఉందనే విషయాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని ఆమె అభిప్రాయపడింది.
సినిమా పరిశ్రమలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయన్న దానిపై తాప్సీ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించింది. ఇండస్ట్రీలో కూడా డిమాండ్ అండ్ సప్లై సూత్రమే పనిచేస్తుందని ఆమె చెప్పింది. ప్రేక్షకులు ఇలాంటి కంటెంట్‌ను కోరుకుంటున్నారని, దాని ద్వారా సినిమాలకు డబ్బులు వస్తాయని నిర్మాతలు, దర్శకులు భావించినప్పుడు అదే తరహా సినిమాలు, సన్నివేశాలు తెరకెక్కుతాయని తాప్సీ పేర్కొంది. అలా క్రమంగా సినిమా కథ, కళ, నటన వంటి అంశాలు వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని ఆమె అభిప్రాయపడింది. కరోనా మహమ్మారికి ముందు సినీ పరిశ్రమ మంచి మార్పు దిశగా పయనించిందని తాప్సీ చెప్పింది. అయితే ప్రస్తుతం మళ్లీ కొన్ని పాత పద్ధతులు తిరిగి వస్తున్నాయని ఆమె అభిప్రాయపడింది.
సినిమా ఆశించిన స్థాయిలో లేకపోతే దానికి ప్రేక్షకుల అభిరుచులను కారణంగా చూపుతూ మేకర్స్ తప్పించుకునే పరిస్థితి ఉందని తాప్సీ వ్యాఖ్యానించింది. నటీనటులు పరిశ్రమలో మార్పు కోసం ఎంత ప్రయత్నించినా.. ప్రేక్షకుల నుంచి మద్దతు లేకపోతే ఆ పోరాటంలో విజయం సాధించడం కష్టమని ఆమె చెప్పుకొచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Heroines
- peddi
- Taapsee Pannu
- Toxic
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

