న్యూఢిల్లీ : ఆక్సియోమ్ నాలుగో అంతరిక్ష వాణిజ్య మిషన్లో భాగంగా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా రోదసిలోకి వెళ్లనున్నారు. ఈ నెల 8న ఫ్లోరిడా నుంచి స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. తద్వారా రోదసి యాత్ర చేపట్టిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించనున్నారు. ఇంతకుముందు రాకేశ్ శర్మ, రష్యా సహకారంతో అంతరిక్షయానం చేసిన సంగతి తెలిసిందే.
దాదాపు 40 ఏండ్ల తర్వాత మళ్లీ ఓ భారతీయుడు రోదసిలోకి వెళ్తుండటం విశేషం. నాసా సహకారంతో శుక్లా ఐఎస్ఎస్లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. శుక్లాతో పాటుగా పోలండ్ నుంచి స్లావోస్జ్ ఉజ్నస్కీ-విస్న్యూస్కీ, హంగరీ నుంచి టిబర్ కాపు ఐఎస్ఎస్కి వెళ్లనున్నారు.