‘ఈ సినిమాలో నేను మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తా. ఈ కథ ఇరవై ఏళ్ల పాటు గుర్తుండిపోవాలనే తపనతో పనిచేశాను. నా మనసుకు నచ్చిన గొప్ప కథ ఇది’ అన్నారు సంతోష్ శోభన్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్నది.
మానస వారణాసి కథానాయిక. నిర్మాత ధీరజ్ మొగిలినేని తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేస్తున్నారు. సోమవారం ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ఫీల్‌గుడ్ రొమాంటిక్ మూవీ ఇదని దర్శకుడు తెలిపారు.
ఈ సినిమా చూసిన అనుభూతిలో చాలా రోజులు ఉండిపోయానని, ఎన్నో ప్రేమకథలు చూస్తుంటాం కానీ ఇదొక విభిన్నమైన కాన్సెప్ట్ అని ధీరజ్ మొగిలినేని చెప్పారు. ఈ సినిమాలో తాను మిత్ర అనే ధైర్యవంతురాలైన అమ్మాయిగా కనిపిస్తానని, చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే క్యూట్ లవ్‌స్టోరీ ఇదని కథానాయిక మానస వారణాసి చెప్పింది. ఈ చిత్రానికి కెమెరా: దినేష్ పురుషోత్తమన్, సంగీతం: ఆదిత్య రవీంద్రన్, రచన-దర్శకత్వం: అశ్విన్ చంద్రశేఖర్.