Shubhanshu Shukla | న్యూఢిల్లీ : అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ ‘ఏగ్జం’ చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘ఏఎక్స్-4’ మిషన్‌కు భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా పైలట్‌గా వ్యవహరించబోతున్నారు. మేలో చేపడుతున్న స్పేస్ఎక్స్ డ్రాగన్ రాకెట్ ప్రయోగం ద్వారా భారత్, పోలండ్, హంగేరీకి చెందిన నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపుతున్నారు. ఈ సందర్భంగా శుభాన్షు శుక్లా మాట్లాడుతూ, ‘ఇది నా దేశానికి చెందిన 140 కోట్ల మంది ప్రయాణం’ అని వ్యాఖ్యానించారు.