చెన్నై: దేశంలో తొలి ప్రైవేటు రైలు (Private train) పట్టాలెక్కింది. ‘భారత్ గౌరవ్’ పేరుతో ప్రైవేటు రైళ్లను నడుపనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి ప్రైవేటు రైలు సర్వీసు తమిళనాడులోని కోయంబత్తూరు నార్త్ నుంచి మహారాష్ట్రలోని షిరిడీ సాయినగర్‌కు మంగళవారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరింది. గురువారం ఉదయం 7.25 గంటలకు షిరిడీ చేరనుంది. దీంతో దేశంలోనే తొలి ప్రైవేటు రైలు సర్వీసును ప్రారంభించిన ఘనత దక్షిణ రైల్వేకి దక్కింది.
కాగా, 20 బోగీలు కలిగిన ఈ రైలులో 1500 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉందని దక్షిణ రైల్వే సీపీఆర్వో గుగణేశన్ తెలిపారు. ఇందులో ఏసీ కోచ్‌లతోపాటు స్లీపర్ కోచ్‌లు ఉన్నాయన్నారు. ఈ రైలును నిర్వాహకులకు రెండేండ్ల కాలపరిమితికి లీజుకిచ్చామని వెల్లడించారు. నెలలో కనీసం మూడు ట్రిప్పులు నడుపుతామన్నారు.