Ashwini Vaishnav | న్యూఢిల్లీ: భారత దేశపు నవతరం అత్యాధునిక రైళ్లు త్వరలో అందుబాటులోకి రాబోతున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో బుధవారం చెప్పారు. గంటకు 280 కి.మీ. వేగంతో నడిచే రైళ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ డిజైన్ చేసి, తయారు చేస్తున్నదని తెలిపారు. దీనికి బీఈఎంఎల్ సహకరిస్తున్నదన్నారు.
మనం తయారు చేసిన వందే భారత్ రైళ్లు విజయవంతమయ్యాయని తెలిపారు. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ అత్యధిక వేగంతో నడిచే రైళ్ల డిజైనింగ్, తయారీ కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఒక కార్ తయారీ వ్యయం సుమా రు రూ.28 కోట్లు అని, మిగిలిన రైళ్లతో పోల్చితే ఇది అత్యంత సరసమైన ధర అని వివరించారు.