మంగళవారం 19 జనవరి 2021
National - Dec 19, 2020 , 01:33:36

మనోళ్లు యూట్యూబ్‌ తెగచూస్తున్నారు

మనోళ్లు యూట్యూబ్‌ తెగచూస్తున్నారు

న్యూఢిల్లీ: గతేడాది జూలైతో పోల్చితే ఈ సంవత్సరం జూలైలో భారతీయులు యూట్యూబ్‌ చూసే సమయం(వాచ్‌ టైం) 45% పెరిగిందని యూట్యూబ్‌ కంపెనీ వెల్లడించింది. ప్రాంతీయ భాషల్లోనే వీడియోలు చూడటానికి ఎక్కువమంది మొగ్గు చూపుతున్నట్టు పేర్కొన్నది. ఇండియన్లలో ప్రతీ ముగ్గురిలో ఒకరు యూట్యూబ్‌ వీడియోలు చూస్తున్నారని తెలిపింది.  అయితే ఎంత సమయం యూట్యూబ్‌లో గడుపుతున్నారన్న విషయాన్ని వెల్లడించలేదు.