న్యూఢిల్లీ: అమెరికా సహా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్(ఓఈసీడీ) కూటమి దేశాలకు వలస వెళ్తున్న వారిలో భారతీయులు ముందు వరుసలో ఉన్నారు. పౌరసత్వం పొందడంలోనూ వారిదే అగ్రస్థానమని అని ఓఈసీడీ తాజా నివేదిక పేర్కొన్నది. అమెరికా పౌరసత్వం పొందుతున్న వారిలో భారతీయులే అత్యధికమని తెలిపింది.