న్యూఢిల్లీ, జూన్ 20: కెనడాలో మరో భారతీయ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. కల్గరీ యూనివర్సిటీలో చదువుతున్న భారత్‌కు చెందిన తాన్యా త్యాగి అనే విద్యార్థిని మరణించింది. అయితే ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయం ఈ విషయాన్ని గురువారం వెల్లడించింది. గత మూడు నెలల కాలంలో భారత్‌కు చెందిన విద్యార్థులు అనుమానాస్పదంగా మరణించడం ఇది నాలుగోసారి. దీంతో విద్యార్థుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.