Indian Railways | న్యూఢిల్లీ: ప్రయాణికులకు సంబంధించి అన్ని రకాల సేవలను ఒకే గొడుకు కిందకు తెస్తూ భారతీయ రైల్వే ఒక మొబైల్ అప్లికేషన్ను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ‘సూపర్ యాప్’లో రైలు టికెట్లు, ప్లాట్ఫామ్ పాసులు బుక్ చేసుకోవడంతో పాటు రైళ్ల షెడ్యూళ్లు తదితర అంశాలు చూసుకోవచ్చు. ఆహారాన్ని కూడా ఆర్డర్ చేయొచ్చు. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్(సీఆర్ఐఎస్) ఈ యాప్ను అభివృద్ధి చేసింది. ఇదే ఈ యాప్ను నిర్వహిస్తుంది.