న్యూఢిల్లీ: వచ్చే జనవరిలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగే కుంభమేళా భక్తుల కోసం రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. రైల్వే మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, దేశంలోని వివిధ నగరాల నుంచి 6,580 రెగ్యులర్ రైళ్లతోపాటు అదనంగా 992 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
మౌలిక సదుపాయాల ఆధునికీకరణ కోసం రూ.933 కోట్లు కేటాయించింది. ప్రయాగ్రాజ్ డివిజన్, దాని పరిసర ప్రాంతాల్లో రూ.3,700 కోట్లతో రైల్వే ట్రాక్ల డబులింగ్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.