SwaRail | న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు అవసరమైన అనేక సేవలను ఒకే ఛత్రం కిందకు తీసుకువస్తూ సూపర్యాప్ పేరుతో ఓ అప్లికేషన్ను రైల్వేశాఖ ప్రయోగాత్మకంగా శుక్రవారం విడుదల చేసింది. గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ యాప్ను 1,000 మంది యూజర్లు మాత్రమే డౌన్లోడ్ చేసుకోగలరని, ప్రజల నుంచి వచ్చే స్పందన, అభిప్రాయాలను అంచనా వేసిన తర్వాత తదుపరి స్పందన కోసం 10,000 డౌన్లోడ్లకు వీలుకల్పిస్తామని రైల్వే బోర్డు సమాచార ప్రచార ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు.
టికెట్ బుకింగ్లు, ప్లాట్ఫామ్, పార్సిల్ బుకింగ్లు, రైలు ఎంక్వైరీలు, పీఎన్ఆర్ ఎంక్వైరీలు, రైల్మదద్ ద్వారా సహాయం, తదితర సేవలు ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు.