న్యూఢిల్లీ: మొబైల్లోనే అన్రిజర్వ్డ్ టికెట్లను బుక్ చేసే సౌకర్యాన్ని భారతీయ రైల్వే కల్పించింది. ప్లాట్‌ఫాం, సీజన్ టికెట్స్ కూడా బుక్ చేసుకొనేలా యూటీఎస్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించింది. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొన్నాక వివరాలను నమోదు కొని లాగిన్ కావాలని తెలిపింది.
ఆర్-వ్యాలెట్‌ను రీచార్జ్ చేసుకొని టికెట్ బుక్చేసుకోవచ్చని, ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణించొచ్చని ఇండియన్ రైల్వే వెల్లడించింది.