హైదరాబాద్: భారతీయ రైల్వే శాఖ ఓ ప్రకటన చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త తరహా డిజిటల్ గడియారాల(Digital Clock)ను రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. అయితే ఈ నేపథ్యంలో ఆ శాక జాతీయ స్థాయి కాంపిటీషన్ ఆర్గనైజ్ చేసింది. సృజనాశక్తి ఉన్న ఔత్సాహికులకు ఈ కాంపిటీషన్లో పాల్గొనే అవకాశం కల్పించింది.
రైల్వే పాట్ఫామ్లు, స్టేషన్లలో డిజిటల్ గడియరాల అవసరం ఉందని, అయితే ఆ గడియారాల డిజైన్‌ను రూపొందించేందుకు కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మొత్తం మూడు కేటగిరీల్లో పోటీలు నిర్వహించనున్నారు. ప్రొఫెషనల్స్, కాలేజీ లేదా యూనివర్సిటీ విద్యార్థులు, స్కూల్ స్టూడెంట్స్‌కు ఈ ఈవెంట్ నిర్వహిస్తారు.
డిజిటల్ క్లాక్ విన్నర్‌కు భారతీయ రైల్వే శాఖ ఫస్ట్ ప్రైజ్ కింద 5 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నది. ఇక మూడు కేటగిరీల్లోనూ అయిదేసి కన్సోలేషన్ ప్రైజలు ఇస్తారు. వారికి ఒక్కొక్కరికి 50 వేల క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నారు.
పోటీల్లో పాల్గోనేవారు మే ఒకటో తేదీ నుంచి 31 వరకు ఆన్లైన్లో తమ డిజైన్లను పంపాల్సి ఉంటుంది. ఎటువంటి వాటర్‌మార్క్ లేదా లోగో లేకుండానే హై రెజల్యూషన్‌లో ఎంట్రీలు పంపాలి. పోటీల్లో పాల్గొనేవాళ్లు ఎన్ని డిజైన్లు అయినా పంపవచ్చు. కానీ వాటికి చిన్న నోట్ రాయాల్సి ఉంటుంది. ఆ డిజైన్ వెనుక ఉన్న థీమ్‌ను వివరించాలి. డిజైన్లు అన్నీ ఒరిజినల్‌గా ఉండాలి. కాపీ కొట్టిన వాటిని స్వీకరించారు.
స్కూల కేటగిరీలో పోటీ పడే విద్యార్థులు తమ ఐడీ కార్డులను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 12వ తరగతి విద్యార్థుల వరకు ఈ పోటీకి అర్హులు. సాధారణ వ్యక్తులందర్నీ ప్రొఫెషనల్ కేటగిరీలో పోటీపడుతారు.
भारतीय रेल के साथ समय को दीजिए नई पहचान!
राष्ट्रीय डिजिटल घड़ी डिज़ाइन प्रतियोगिता में लीजिए हिस्सा और जीतिए 5 लाख रुपए का पुरस्कार।
यहां भेजें अपनी एंट्री: contest.pr@rb.railnet.gov.in pic.twitter.com/3W9sjYd8DE— Ministry of Railways (@RailMinIndia) May 2, 2025