Train Accident | గత కొంతకాలంగా రైలు ప్రమాదాలు ప్రయాణికులను కలవరానికి గురి చేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా రైళ్లు పట్టాలు తప్పడం.. మంటలు చెలరేగడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నుంచి మహారాష్ట్రలోని ముంబయికి వెళ్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలు జల్గావ్ సమీపంలో ప్రమాదానికి గురైంది. రైలు పచోరా పర్ధాడే స్టేషన్ సమయంలో మంటలు చెలరేగాయని ప్రచారం జరిగింది.
ఆ తర్వాత పలువురు ప్రయాణికులు రైలు నుంచి దూకేశారు. ఓ వైపు రైలు వెళ్తున్న సమయంలోనే కొందరు ప్రయాణికులు దూకడంతో పక్క ట్రాక్‌పై నుంచి వెళ్తున్న కర్నాటక ఎక్స్‌ప్రెస్ వెళ్లడంతో ఢీకొనడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో దాదాపు 13 మంది వరకు దుర్మరణం పాలవగా.. పలువురు గాయపడ్డారు. గతంలోనూ పలు ఘోర రైలు ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాల్లో జరిగిన రైలు ప్రమాదాలను ఒకసారి పరిశీలిద్దాం..!
Adar Poonawala | వారానికి 90 గంటల పని విధానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అదార్ పూనావాలా..!
Samsung Galaxy S25 | మార్కెట్లోకి సామ్సంగ్ గెలాక్సీ ఎస్25.. ధర, ఫీచర్లు ఇవే