Nepal Floods : అకస్మికంగా సంభవించిన నేపాల్ వరదలు (Nepal Floods) పలు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చాయి. ఊళ్లకు ఊళ్లను మింగేసిన ఈ వరదల్లో వేలాదిమంది గల్లంతయ్యారు. ఆధ్యాత్మిక యాత్రకు వచ్చిన భారత సంతతికి చెందిన అమెరికా దంపతుల ఆచూకీ సైతం తెలియడం లేదు. యూఎస్ నుంచి ‘కైలాష్ మానస్‌సరోవర్ యాత్ర’కోసం విచ్చేసిన దీపక్ ఆహుజా, మధు అహుజాలు ఎక్కడ చిక్కుకున్నారు? అనేది అంతు చిక్కడం లేదు.
అమెరికాలో స్థిరపడిన భారత సంతతికి దీపక్ ఆహుజా(60), మధు అహుజా(57) దంపతులు ఇటీవలే ఆధ్యాత్మిక యాత్రకోసం వచ్చారు. కైలాష్ యాత్రలో భాగంగా వీరు నేపాల్ సరిహద్దు.. టిబెట్‌లోని సగాలో తమ బృందంతోపాటు సద్గురును కలిశారు. చివరిసారిగా వీరు కనిపించింది కూడా అక్కడే. అనూహ్యంగా ప్రళయం సృష్టించిన నేపాల్ వరదల తర్వాత దీపక్, మధుల జాడ తెలియడం లేదు. ఇప్పటికే ఈ భయానక వరదల్లో 170మందికి పైగా మరణించారని అధికారికంగా ప్రకటించారు. దాంతో, దీపక్, మధుల గురించి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
The forces of nature are simply beyond human comprehension.
The flash floods in Nepal descended at rapid speed from surrounding mountain slopes, according to analysts.
Footage captured the panic felt on the ground yesterday, with workers fleeing in terror in the Nuwakot… pic.twitter.com/OmZy77gZGk
— Lagos Waste REPORTER (@LagosWaste) August 27, 2026

ఎన్డీటీవీ మీడియాతో వీరి అల్లుడు అకాశ్ మహంతి మాట్లాడుతూ తమ మామ, అత్త ఆధ్యాత్మిక యాత్రకోసం భారత్‌కు వచ్చారని చెప్పాడు. ఇషా ఫౌండేషన్ వారి ‘ఇషా సాక్రేడ్ వాక్స్’ చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న మధు, దీపక్‌లు.. వరదల సమయంలో గైరాంగ్ ఇమ్మిగ్రేషన్ కేంద్రంలో ఉన్నట్టు తెలిసిందని ఆయన పేర్కొన్నాడు. ఎస్3 గ్రూప్‌లోని మధు, దీపక్ కైలాష్ మానస్‌సరోవర్ యాత్ర నుంచి తిరిగి వస్తుండగా నేపాల్‌ను వరదలు చుట్టేశాయి.