న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన ఓపెన్ఏఐ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ(Suchir Balaji) ఆత్మహత్య చేసుకున్నాడు. శాన్ఫ్రాన్సిస్కోలో 26 ఏళ్ల ఆ వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణించాడు. నగంరలోని బుచానన్ స్ట్రీట్ అపార్ట్మెంట్లో సుచిన్ బాలాజీ మృతదేహాన్ని గుర్తించారు. అతను సూసైడ్ చేసుకున్నట్లు మెడికల్ ఆఫీసర్ తెలిపారు. మరణం వెనుక ఎటువంటి ఆధారాలు లేవని పోలీసులు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పేరుగాంచిన ఓపెన్ఏఐ సంస్థలో జరుగుతున్న అక్రమాలను సుచిర్ బాలాజీ వెలుగులోకి తెచ్చాడు. ఆ కంపెనీ అనుసరిస్తున్న వ్యాపార విధానంపై ఇప్పటికే పలు దావాలు దాఖలు అయ్యాయి.
ఓపెన్ఏఐ సంస్థ అమెరికా కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించినట్లు మూడు నెలల క్రితం సుచిర్ బాలాజీ ఆరోపించారు. ఆ కంపెనీ అక్రమరీతిలో చాట్‌జీపీటీ డెవలప్ చేసినట్లు అతను పేర్కొన్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్‌కు చెందిన చాట్‌జీపీటీ టెక్నాలజీ ద్వారా ప్రస్తుతం లక్షలాది మంది డబ్బులు ఆర్జిస్తున్నారు. ఓపెన్ఏఐ సంస్థ వ్యాపారవేత్తలను, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను వేధిస్తున్నట్లు బాలాజీ ఆరోపించారు. సమాజానికి హాని చేసే సంస్థలో ఉండకూడదన్న ఉద్దేశంతో ఓపెన్ఏఐ సంస్థను బాలాజీ వదిలివెళ్లాడు.