న్యూఢిల్లీ: అధునాతన ‘ఐఎన్ఎస్ తుశిల్’ యుద్ధ నౌక భారత నౌకాదళంలో చేరింది. రష్యాలో తయారైన ఈ యుద్ధ నౌక.. సోమవారం ఆ దేశంలోని కాలినిన్గ్రాడ్లో భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ దినేశ్ కే త్రిపాఠి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
3,900 టన్నుల బరువు, 125 మీటర్ల పొడువుగల ఐఎన్ఎస్ తుషీల్ను త్వరలోనే హిందూ మహాసముద్రంలో భారత్ మోహరించనున్నది. చైనా నేవీని దీటుగా ఎదుర్కొనటంలో, భారత నౌకా దళాల సామర్థ్యాన్ని పెంచటంలో ‘ఐఎన్ఎస్ తుశిల్’ కీలక పాత్ర పోషిస్తుందని భారత్ భావిస్తున్నది.