కాలినిన్గ్రాడ్: భారతీయ నౌకాదళంలోకి కొత్త యుద్ధ నౌక వస్తోంది. ఐఎన్ఎస్ తుషిల్(INS Tushil) డిసెంబర్ 9న నేవీలో కలవనున్నది. రష్యాలోని కాలినిన్గ్రాడ్లో ఆ నౌకను జలప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటున్నారు. క్రివాక్-3 క్లాస్ ఫ్రిగేట్‌కు చెందిన అప్‌గ్రేడ్ వర్షన్ ఐఎన్ఎస్ తుషిల్ . 1135.6 ప్రాజెక్టులో భాగంగా ఈ యుద్ధనౌకలను తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఆరు నౌకలు సర్వీసులో ఉన్నాయి.
#INSTushil – New Sentinel of the Seas
Unveiling the crest of Indian Naval Ship Tushil, displaying an emblem of status, power and identity.
09 Dec 2024 🔥💪🏻 https://t.co/wnzALAhm8T pic.twitter.com/qg1FjmcF9E
— Indian Navy Updates (@indiannavyupd) December 6, 2024
మూడు తల్వార్ క్లాసు, మరో మూడు టెగ్ క్లాసు షిప్‌లు ఉన్నాయి. తల్వార్ క్లాసు నౌకలను సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని బాల్టిస్కీ షిప్‌యార్డులో, మిగితా మూడు కాలినిన్గ్రాడ్లోని యాంటర్ షిప్‌యార్డులో తయారు చేశారు. అయితే ఇదే సిరీస్‌కు చెందిన ఏడవ యుద్ధ నౌక ఐఎన్ఎస్ తులసి. ఈ యుద్ధ నౌక తయారీ కోసం 2016లో రోసోబోరన్ ఎక్స్పోర్ట్, ఇండియన్ నేవీ, భారత ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది.
.@indiannavy is all set to commission its latest multi-role stealth-guided missile frigate, INS Tushil, at Kaliningrad, Russia, on 9 Dec, 2024
The ceremony will be presided over by Raksha Mantri, @rajnathsingh as the Chief Guest, with many high-ranking Russian and Indian…
— PIB India (@PIB_India) December 6, 2024
ఐఎన్ఎస్ తుషిల్ 125 మీటర్ల పొడువు.. 3900 టన్నుల బరువు ఉంది. రష్యా, ఇండియన్ టెక్నాలజీతో దీన్ని తయారు చేశారు. కొత్త డిజైన్‌తో ఆ నౌకకు స్టీల్త్ ఫీచర్లను ఇచ్చారు. భారత నేవీ స్పెషలిస్టులు, సెవిరినోయి డిజైన్ బ్యూరో నిపుణులు దీన్ని డిజైన్ చేశారు. 33 శాతం మేడిన్ ఇండియా పరికరాలను వాడారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, కేల్ట్రన్, నోవా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ టాటా, ఎల్కోమ్ మెరైన్, జాన్సన్ కంట్రోల్ ఇండియా సంస్థలు పరికరాలను తయారు చేశాయి.