INS Visakhapatnam | రేపు జలప్రవేశం చేయనున్న ఐఎన్ఎస్ విశాఖపట్నం
INS Visakhapatnam | ప్రాజెక్ట్-15బీలో భాగంగా నిర్మించిన ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌక ఆదివారం జలప్రవేశం చేయనున్నది. ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో కమీషన్ వేడుక జరుగుతుందని, కార్యక్రమానికి

ముంబై : ప్రాజెక్ట్-15బీలో భాగంగా నిర్మించిన ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌక ఆదివారం జలప్రవేశం చేయనున్నది. ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో కమీషన్ వేడుక జరుగనుండగా.. కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు. అలాగే 25న కల్వరి క్లాస్ సబ్ మెరైన్ వెలా నాల్గో సబ్‌మెరైన్ జలప్రవేశం చేయనుండగా.. చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ పాల్గొనున్నారు.
ఈ సందర్భంగా ఐఎన్ఎస్ కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ బీరేంద్ర సింగ్ బైన్స్ మాట్లాడుతూ ఐఎన్ఎస్ విశాఖపట్నం కమీషనింగ్ కోసం సిద్ధంగా ఉన్నామన్నారు. ఐఎన్ఎస్ విశాఖపట్నం షిప్‌ను డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ చేయగా ముంబైలోని మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిలెడ్ నిర్మించింది. ప్రాజెక్టు-15బీలో భాగంగా నిర్మించిన నాలుగు నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన నగరాలైన విశాఖపట్నం, మోర్ముగావ్, ఇంఫాల్, సూరత్ పేర్లు పెట్టారు. వేలా కల్వరి క్లాస్ నాల్గో జలాంతర్గామి కాగా.. భారత అమ్ములపొదిలో మరో శక్తివంతమైన ఆయుధంగా నిలువనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

