సాన్‌డియాగో: సికోర్స్కీ ఎంహెచ్60ఆర్ మల్టీ రోల్ హెలికాప్టర్లను.. అమెరికా నౌకాదళం భారత్‌కు అప్పగించింది. తొలి దశలో భాగంగా రెండు హెలికాప్టర్లను ఇండియన్ నేవీకి అందేశారు. సాన్‌డియాగోలో ఉన్న నార్త్ ఐల్యాండ్‌లోని నావెల్ ఎయిర్ స్టేషన్లో ఈ అప్పగింత కార్యక్రమం జరిగింది. భారతీయ నౌకాదళం 24 సికోర్స్కీ హెలికాప్టర్లకు ఆర్డర్ ఇచ్చింది. విదేశీ సైనిక ఒప్పందంలో భాగంగా లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ వీటిని ఉత్పత్తి చేస్తున్నది. సుమారు 2.4 బిలియన్ల డాలర్లు పెట్టి ఎంహెచ్-60ఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. హెలికాప్టర్ల అప్పగింత కార్యక్రమంలో భారతీయ అంబాసిడర్ తరన్‌జిత్ సింగ్ సంధూ పాల్గొన్నారు. వైస్ అడ్మిరల్ కెన్నెత్ వైట్సెల్, వైస్ అడ్మిరల్ రవ్నీత్ సింగ్ ఒప్పంద డాక్యుమెంట్లను మార్చుకున్నారు.
Deepening 🇮🇳🇺🇸 Defence ties !
— Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) July 16, 2021
Attended the handing over ceremony of the first @LockheedMartin #MH60R Multi Role Helicopters from @USNavy to @indiannavy, along with Vice Adm. Kenneth Whitesell, Commander US Naval Air Forces and DCNS Vice Adm Ravneet Singh at #SanDiego today. pic.twitter.com/DGUK1FfQwE