Lieutenant Rekha singh | న్యూఢిల్లీ: మూడేండ్ల కిందట గల్వాన్‌లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన భారత జవాన్ నాయక్ దీపక్‌సింగ్ భార్య రేఖా సింగ్ (Rekha singh)ఆయన స్ఫూర్తిని పుణికి పుచ్చుకున్నారు. తాను కూడా సైన్యంలో చేరాలని అప్పుడే నిర్ణయించుకున్న ఆమె సైనిక శిక్షణ పొందారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకొని లెఫ్ట్‌నెంట్ (Lieutenant) హోదాలో సైన్యంలో చేరారు. ఆమె తూర్పు లఢక్‌లో విధులను నిర్వహించనున్నారు.
Artillery Regiments
భారత సైన్యంలోని శతఘ్ని(ఆర్టిలరీ) విభాగానికి ఐదుగురు మహిళలు అధికారిణులుగా నియమితులై కొత్త చరిత్ర సృష్టించారు. లెఫ్ట్‌నెంట్ మెహక్ సైని, సాక్షి దూబే, ఆదితి యాదవ్, పియస్ ముద్గిల్ ఈ ఘనత సాధించారు. చెన్నైలోని అధికారుల శిక్షణ కేంద్రంలో శనివారం శిక్షణ పూర్తి చేసుకున్న వీరు దేశ సరిహద్దులో సవాళ్లు విసిరే సమస్యాత్మక ప్రాంతాల్లో విధులు నిర్వర్తించనున్నారు.