న్యూఢిల్లీ: బ్రిటన్‌లో ఉన్న భారత హై కమీషనర్(Indian High Commissioner) విక్రమ్ దొరైస్వామికి చేదు అనుభవం ఎదురైంది. స్కాట్లాండ్లో ఉన్న గురుద్వారా వద్ద ఆయన్ను ఖలిస్తానీ తీవ్రవాదులు అడ్డుకున్నారు. హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య విషయంలో కెనడా, భారత్ మధ్య గత కొన్నాళ్ల నుంచి వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఘటన ప్రాచుర్యాన్ని సంతరించుకున్నది. గ్లాస్గోవ్లోని ఆల్బర్ట్ రోడ్డులో ఉన్న గురుద్వారా వద్దకు దొరైస్వామి చేరుకుంటున్న సమయంలో.. ఖలిస్తానీ కార్యకర్తలు అడ్డుకుంటున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. హై కమీషనర్ కారు పార్కింగ్ ఏరియాలో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు.కారు డోర్‌ను ఓపెన్ చేసేందుకు ఆ వ్యక్తులు ప్రయత్నించారు. అయితే ఆ కారు గురుద్వారా వద్ద ఆగకుండానే వెళ్లిపోయింది. హై కమీషనర్ సెక్యూర్టీ విషయంలో జరిగిన జాప్యంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు.
Indian diplomat Stopped to enter in gurudwara in uk pic.twitter.com/WpsHrlUEWK
— INDIPLUS NEWS 🇮🇳 (@IndiplusNews) September 30, 2023