సరైన ట్రాక్‌లో ఆర్ధిక వ్యవస్థ : మంత్రి నిర్మల
Indian economy : ఆర్ధిక వ్యవస్థ సరైన ట్రాక్‌లో వెళ్తోందని మంత్రి నిర్మల తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజల తలసరి ఆదాయం రెండింతలు అయినట్లు చెప్పారు.
న్యూఢిల్లీ: భారతీయ ఆర్ధిక వ్యవస్థ సరైన ట్రాక్‌లో ఉందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇవాళ ఆమె లోక్‌సభలో 2023 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. భారత ఆర్ధిక వ్యవస్థ దివ్యమైన భవిష్యత్తు దిశగా వెళ్తోందన్నారు. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని ఆమె తెలిపారు. కోవిడ్ సమయంలో ఎవరూ ఆకలితో చావకూడదన్న ఉద్దేశంతో.. సుమారు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందజేసినట్లు మంత్రి వెల్లడించారు. 28 నెలలుగా ఆ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
గడిచిన 9 ఏళ్లలో తలసరి ఆదాయం రెండింతలు అయ్యిందని, అది 1.97 లక్షలకు చేరుకున్నట్లు ఆమె చెప్పారు. భారతీయ ఆర్ధిక వ్యవస్థ ప్రపంచలోనే అయిదవ అతిపెద్ద వ్యవస్థగా మారిందన్నారు. భారత్ ధగధగ వెలుగుతున్న నక్షత్రమని ప్రపంచం గుర్తించిందని, ఈ ఏడాదికి మన వృద్ధి 7.0 శాతంగా ఉందని, అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థల్లో మనదే అత్యధిక స్థాయిలో ఉందన్నారు.
టూరిజంకు భారీ స్థాయిలో ప్రమోషన్ ఇవ్వనున్నట్లు మంత్రి నిర్మల తెలిపారు. డిజిటల్ పేమెంట్స్ విషయంలో భారత ఆర్ధిక వ్యవస్థ చాలా పరిణితి సాధించిందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

