అహ్మదాబాద్: గుజరాత్‌లోని అరేబియా సముద్రంలో స్మగ్లర్లు పారేసిన రూ.1800 కోట్ల విలువైన 300 కిలోల మాదక ద్రవ్యాలను ఆ రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్), భారత తీర ప్రాంత గస్తీ దళం స్వాధీనం చేసుకున్నాయి.
ఈ నెల 12న అర్ధరాత్రి తాము నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో భారత సముద్ర సరిహద్దు రేఖ వద్ద ఈ డ్రగ్స్‌ను సీజ్ చేసినట్టు అధికారులు సోమవారం తెలిపారు. తీర ప్రాంత గస్తీ దళం నౌక రావడాన్ని గమనించిన స్మగ్లర్లు తమ పడవలోని డ్రగ్స్‌ను సముద్రంలో పారేసి పారిపోయారని వారు చెప్పారు.