Indian Climber | రికార్డు కోసం ప్రాణాలను పోగొట్టుకుంది.. ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వద్ద భారత పర్వతారోహకురాలి మృతి
Indian Climber | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ (Mt Everest) శిఖరాన్ని అధిరోహించి ఆసియాలోనే తొలి మహిళగా రికార్డు సృష్టించాలనుకున్న ఓ భారత పర్వతారోహకురాలి (Indian Climber ) ఆశలు మధ్యలోనే ఆవిరైపోయాయి.
Indian Climber | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ (Mt Everest) శిఖరాన్ని అధిరోహించి ఆసియాలోనే తొలి మహిళగా రికార్డు సృష్టించాలనుకున్న ఓ భారత పర్వతారోహకురాలి (Indian Climber ) ఆశలు మధ్యలోనే ఆవిరైపోయాయి. అనారోగ్యం కారణంగా మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (Mt Everest Base Camp)లో విన్యాసాల సమయంలో ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయింది.
భారత్‌కు చెందిన సుజానే లియోపోల్డినా జీసస్ (Suzanne Leopoldina Jesus) అనే పర్వతారోహకురాలు (Climber) గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోంది. దీంతో ఆమెకు వైద్యులు పేస్‌మేకర్ (pacemaker) అమర్చారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలన్నది ఆమె కల. ఇందులో భాగంగానే ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శిఖరాన్ని ఎక్కేందుకు సిద్ధమైంది. అయితే బేస్‌క్యాంప్ వద్ద సాధారణ విన్యాసాల్లో ఆమె కనీసవేగాన్ని అందుకోలేక ఇబ్బంది పడింది. దీంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని అధికారులు ఆమెను కోరారు.
అయినా వారి మాటలను ఆమె లెక్కచేయలేదు. ఎవరెస్ట్ ఎక్కేందుకు అన్ని అనుమతులు తెచ్చుకున్నానని.. వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే తన ప్రయాణాన్ని కొనసాగించింది. బేస్ క్యాంప్ నుంచి 5,800 మీటర్ల ఎత్తుకు ఎక్కిన తర్వాత ఆమె ఆరోగ్యం సహకరించలేదు. దీంతో బలవంతంగా ఆమెను సోలుఖంబు జిల్లాలోని లుక్లా పట్టణంలో గల ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్లు నేపాల్ పర్యాటక శాఖ డైరెక్టర్ యువరాజ్ ఖతివాడ (Yuvaraj Khatiwada) తెలిపారు.
Also Read..
Amitabh Bachchan | అరెస్టయ్యా అంటూ అభిమానులను ఆటపట్టించిన అమితాబ్.. పిక్ వైరల్
Virat Kohli | ఇప్పటికే చాలా ఒత్తిడికి లోనయ్యా.. నాపై వచ్చే విమర్శలను పట్టించుకోను : కోహ్లీ
Cannes 2023 | కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసిన బీటౌన్ తారలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

