Captain Rakesh Ranjan Singh | హొర్ముజ్‌లో భారత కెప్టెన్ మృతి..నౌక చిక్కుకుపోవడమే కారణం!
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన దరిమిలా హొర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయి రాంచీకి చెందిన మెర్చంట్ నేవీ మాజీ అధికారి కెప్టెన్ రాకేశ్ రంజన్ సింగ్(47) గుండెపోటుతో మరణించారు.
- నౌక చిక్కుకుపోవడమే కారణం!
రాంచి, మార్చి 21: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన దరిమిలా హొర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయి రాంచీకి చెందిన మెర్చంట్ నేవీ మాజీ అధికారి కెప్టెన్ రాకేశ్ రంజన్ సింగ్(47) గుండెపోటుతో మరణించారు. అయన అనే నౌకలో పనిచేసేందుకు ఫిబ్రవరి 2న రాకేశ్ రాంచీ నుంచి దుబాయ్‌కు బయల్దేరినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. చమురు కన్సైన్మెంట్ని లోడ్ చేసుకుని భారత్‌కు పయనమయ్యేందుకు మార్చి 1న ఆ నౌక హొర్ముజ్ జల సంధిలోకి ప్రవేశించింది. అయితే ఆ ప్రాంతంలో యుద్ధ పరిస్థితి నెలకొనడంతో ఆ నౌక సముద్రంలో చిక్కుకుపోయింది. గడచిన 18 నుంచి 20 రోజులుగా అయన నౌక దుబాయ్‌కు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయిందని కుటు ంబ సభ్యులకు సమాచారం అందించింది. సముద్రంలో సుదీర్ఘకాలం చిక్కుకుపోవడంతో మార్చి 18న హఠాత్తుగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో ఆయన దుబా య్‌లో దవాఖానకు చేరకముందే గుండెపోటుతో మరణించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

