న్యూఢిల్లీ, మార్చి 14: జమ్ము కశ్మీర్లో ప్రస్తుతం సుమారు 60 మంది విదేశీ ఉగ్రవాదులు క్రియాశీలకంగా పని చేస్తున్నారని భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. వీరిలో అత్యధికంగా 35 మంది లష్కరే తోయిబా(లెట్) తరఫున పనిచేస్తుండగా 17 మంది స్థానిక టెర్రరిస్టులు విద్రోహ కార్యకలాపాలను సాగిస్తున్నారని చెప్పాయి.
జైషేకి చెందినవారు 21 మంది, హిజ్బుల్కు చెందిన వారు ముగ్గురు ఈ ప్రాంతంలో చురుగ్గా తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు సైన్యం తెలిపింది. 17 మంది స్థానిక తీవ్రవాదులలో 14 మంది శ్రీనగర్ లోయలో, మిగిలిన వారు జమ్మూ సెక్టార్లో కార్యకలాపాలు సాగిస్తున్నారని చెప్పింది.