న్యూఢిల్లీ : ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసుకున్న వారికి ఇండియన్ ఆర్మీ(Indian Army) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. షార్ట్ సర్వీస్ కమీషన్ పరీక్షలు నిర్వహించనున్నది. అర్హులైన మేల్, ఫిమేల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 381 ఖాళీలు ఉన్నాయి. దీంట్లో 350 మంది పురుషులు, 31 మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులను లెఫ్టినెంట్లుగా కమీషన్ చేయనున్నారు. శిక్షణ పూర్తి అయిన తర్వాత ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఉద్యోగాలు కల్పిస్తారు. 20 నుంచి 27 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఇవ్వవచ్చు. ఎస్ఎస్సీ టెక్ వుమెన్(66 ఎంట్రీ), ఆగస్టు 21వ తేదీ వరకు, ఎస్ఎస్సీ టెక్ మెన్(66 ఎంట్రీ) ఆగస్టు 22, సాయంత్రం 3 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ ఆర్మీ( joinindianarmy.nic.in.) వెబ్సైట్లో మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.