Indian Army | ఈ నెల 26న జరిగే 76వ గణతంత్ర దినోత్సవాలకు (Republic Day Parade) దేశ రాజధాని నగరంలోని కర్తవ్యపథ్ ముస్తాబవుతోంది. ఈ వేడుకలకు విదేశీ ప్రముఖులతోపాటు పారాలింపిక్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు, ఉత్తమ పని తీరు కనబరచిన గ్రామాల సర్పంచ్‌లు, చేనేత కళాకారులు, అటవీ, వన్య ప్రాణి సంరక్షకులు ఇలా దాదాపు 10,000 మంది ప్రత్యేక అతిథులను కేంద్రం ఆహ్వానించింది. ఇక గణతంత్ర వేడుకల్లో భాగంగా భారత ఆర్మీ ఇప్పటికే పలు విన్యాసాలు చేస్తోంది. ఈ క్రమంలో భారత ఆర్మీ (Indian Army)కి చెందిన డేర్‌డెవిల్స్ (Daredevils) టీమ్ సరికొత్త రికార్డు సృష్టించింది.
#IndianArmy ke #DareDevils yaad hai na, Is baar phir #Kartavyapath par #RepublicDayParade2025 mai.🇮🇳
Our National Flag, Always Fly High.
All set for new world record. pic.twitter.com/ToIvYGICvo— Manish Prasad (@manishindiatv) January 20, 2025
కదులుతున్న బైక్స్‌పై అత్యంత ఎత్తైన మానవ పిరమిడ్ (20.4 అడుగులు)ను (highest human pyramid) నిర్మించి ప్రపంచ రికార్డు (world record) సృష్టించింది. తద్వారా అసాధారణమైన ఫీట్‌ను సాధించింది. ఏడు మోటార్ సైకిళ్లపై 40 మంది 2 కిలోమీటర్ల మేర ప్రయాణించడం ద్వారా ఈ ఘనతను అందుకుంది. ఆర్మీలోని మోటార్ సైకిల్ రైడర్ డిస్ప్లే టీమ్‌ను ‘డేర్ డెవిల్స్’ అని పిలుస్తారు. ఈ టీమ్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. అంతేకాదు.. తమ ప్రదర్శనలతో అంతర్జాతీయ ప్రశంసలు కూడా అందుకుంది. ఈ టీమ్ ఇప్పటికే ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సహా 33 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. 1935 నుంచి ఇప్పటి వరకూ డేర్‌డెవిల్స్ టీమ్.. గణతంత్ర దినోత్సవ పరేడ్లు, ఆర్మీ డే పరేడ్లు సహా ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో దాదాపు 1,600 మోటార్ సైకిల్స్ ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
Also Read..
Sabarimala | శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత.. మణికంఠుడిని ఎంత మంది దర్శించుకున్నారంటే?
Rahul Gandhi | అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో రాహుల్‌కు భారీ ఊరట
Saif Ali Khan | సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు.. కోర్టులో ఇద్దరు లాయర్ల గొడవ.. జడ్జి ఏం చేశారంటే?