Breaking news : ఉగ్రవాదులు మరోసారి బరితెగించారు. ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రం కతువా జిల్లాలోని మచేడి ఏరియాలో ఈ ఉగ్రవాద దాడి జరిగింది. కాన్వాయ్‌పై ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో మచేడిలో కలకలం రేగింది. ఆర్మీ కాన్వాయ్ మచేడి ఏరియా నుంచి వెళ్తుండగా మాటువేసిన దుండగులు ఒక్కసారిగా ఆ కాన్వాయ్ లక్ష్యంగా కాల్పులకు దిగారు.
దాంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు మొదలుపెట్టారు. ప్రస్తుతం రెండు వైపుల నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. ఫైరింగ్ జరుగుతున్న ప్రాంతం ఇండియన్ ఆర్మీకి చెందిన 9 కార్ప్స్ పరిధిలోకి వస్తుందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు.