న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీ సెల్ కొత్తగా ఎలక్ట్రిక్ జిప్సీ(Electric Gypsy) వాహనాలను ప్రవేశపెట్టింది. ఐఐటీ ఢిల్లీ, ట్యాడ్‌పోల్ ఈవీ స్టార్టప్‌లతో కలిసి భారతీయ సైన్యం .. పాత జిప్సీ వాహనాలను కొత్త ఎలక్ట్రిక్ జిప్సీ వాహనాలుగ మార్చేస్తుంది. నిజంగానే ఈ వాహనాలు చూడటానికి చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. ఎలక్ట్రిక్ అని ఆ వాహనాలపై కూడా రాశారు. రిట్రోఫిట్టింగ్ పేరుతో పాత జిప్సీలను కొత్తగా లుక్‌లో ప్రజెంట్ చేస్తున్నారు. ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో ఎలక్ట్రిక్ జిప్సీలను ప్రదర్శనకు పెట్టారు.
రిట్రోఫిట్టింగ్ చేసిన కారుకు డిఫరెంట్ కలర్స్ వేశారు. ఓవరాల్‌గా వైట్ కలర్లో ఉన్నా.. గ్రీన్ కలర్ షేడ్స్ కూడా కనిపిస్తున్నాయి. వాహనం చివరలో ఒకవైపు ప్యూర్ ఈవీ అని రాసి ఉంది. ఇక డోర్ వద్ద భారతీయ ఆర్మీకి చెందిన సింబుల్ కూడా ఉంది.