చెన్నై : తమిళనాడులోని నీలగిరి కొండల్లో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాద ఘటనలో మొత్తం 13 మంది మరణించినట్లు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటనలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ తీవ్ర గాయాలతో మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వాయుసేన ప్రకటించింది. వరుణ్ సింగ్ మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వరుణ్ సింగ్ శౌర్య చక్ర అవార్డును అందుకున్నారు. 2020లో ఎల్సీఏ తేజస్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఏరియల్ ఎమర్జెన్సీలో సేవ్ చేసినందుకు గానూ వరుణ్ సింగ్‌ను శౌర్య చక్ర అవార్డుతో సత్కరించారు.
ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు 11 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు వాయుసేన స్పష్టం చేసింది.
Gp Capt Varun Singh SC, Directing Staff at DSSC with injuries is currently under treatment at Military Hospital, Wellington.
— Indian Air Force (@IAF_MCC) December 8, 2021