న్యూఢిల్లీ: దేశీంగా రూపొందించి అభివృద్ధి చేసిన హెలికాప్టర్ లాంచ్ స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్ (SANT) క్షిపణిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భారత వాయుసేన (ఐఏఎఫ్) సంయుక్తంగా శనివారం పరీక్షించాయి. రాజస్థాన్లోని పోఖ్రాన్ రేంజ్లో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. 10 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను నిర్వీర్యం చేసే సామర్థ్యమున్న భారీ విధ్వంసక యాంటీ ట్యాంక్ క్షిపణిని ఐఏఎఫ్ హెలికాప్టర్ నుంచి ప్రయోగించి పరీక్షించారు. మిషన్ లక్ష్యాలన్నింటినీ ఇది సాధించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ మిషన్ బృందాన్ని అభినందించారు. మరోవైపు ఈ ప్రయోగానికి సంబంధించిన స్లో మోషన్ వీడియోను డీఆర్డీవో విడుదల చేసింది.
Indigenously designed and developed Helicopter launched Stand-off Anti-tank (SANT) Missile was successfully flight tested from Pokhran ranges.https://t.co/y5nvAdPISy pic.twitter.com/k3yTDOaZqG
— DRDO (@DRDO_India) December 11, 2021